భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఇందిరా కాలనీలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. ప్రజలంతా భౌతికదూరం పాటించకుండా గుంపులు గుంపులుగా ఎగబడ్డారు. లాక్డౌన్ సమయంలో ఇలాంటి కార్యక్రమాలు వైరస్ వ్యాప్తికి సింహద్వారంగా ఉంటాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు... ఇటువంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.