తెలంగాణ

telangana

ETV Bharat / state

మతోన్మాద పాలకులకు ప్రజలే బుద్ధి చెప్పాలి: తమ్మినేని - అశ్వారావుపేట

మతోన్మాద పాలకులకు ప్రజలే బుద్ధి చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

మతోన్మాద పాలకులకు ప్రజలే బుద్ధి చెప్పాలి: తమ్మినేని

By

Published : Sep 29, 2019, 12:43 PM IST

మతోన్మాద పాలకులకు ప్రజలే బుద్ధి చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నిర్వహించిన సీపీఎం పార్టీ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన హాజరయ్యారు. హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో సీపీఎం పార్టీ బరిలో ఉంటుందని, ఈనెల 29న అభ్యర్థిని ప్రకటించి 30న నామినేషన్ వేస్తామని ఆయన తెలిపారు. సింగరేణి కార్మికులకు బోనస్ ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్​ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో దేశంలో సామాన్య ప్రజలు నిత్యవసరాలు సైతం కొనలేని స్థితిలో ఉన్నారని ఆయన విమర్శించారు.

మతోన్మాద పాలకులకు ప్రజలే బుద్ధి చెప్పాలి: తమ్మినేని

ABOUT THE AUTHOR

...view details