భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తుపాకీ మోతలతో దద్ధరిల్లింది. గుండాల మండలంలో పోలీసులకు న్యూ డెమోక్రసీ అజ్ఞాత దళ నేత లింగన్న వర్గానికి మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో లింగన్న మృతి చెందాడు. విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న దేవుళ్ల గ్రామ ప్రజలు... పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపించారు. గ్రామస్థుల దాడితో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులపైకి రాళ్లు రువ్విన దేవుళ్ల తండా ప్రజలు - భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, న్యూ డెమోక్రసీ సభ్యుల మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి లింగన్న మృతిచెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న దేవుళ్ల గ్రామ ప్రజలు పోలీసులపైకి రాళ్ల వర్షం కురిపించారు.
police