తెలంగాణ

telangana

ETV Bharat / state

విధుల్లోకి రాని సింగరేణి కరోనా బాధితులకు జరిమానా - సింగరేణి ఉద్యోగులకు జరిమానా

ఓ వైపు కరోనా బారిన పడ్డవారు విధులకు రావొద్దని చెబుతూనే.. రాలేని వారికి జరిమానా విధించారని భద్రాద్రి జిల్లా ఇల్లందులోని రైల్వే ఒప్పంద కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. కోత విధించిన డబ్బంతా.. కార్మికుల ఎకౌంట్లో జమ చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కొత్తగూడెం రీజియన్ ప్రధాన కార్యదర్శి యాకుబ్ షావలి డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

Penality for singareni workers
Penality for singareni workers

By

Published : May 20, 2021, 10:16 AM IST

కరోనాతో విధుల్లోకి రాలేని కార్మికులకు ప్రయోజనాలు కల్పించాల్సింది పోయి.. జరిమానాలు విధించారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కొత్తగూడెం రీజియన్ ప్రధాన కార్యదర్శి యాకుబ్ షావలి ఆవేదన వ్యక్తంచేశారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులోని రైల్వే ఒప్పంద కార్మికులకు రోజుకు రూ. 300 చొప్పున జరిమానా విధించారని వాపోయారు.

కొవిడ్ బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతోన్న ఒక్కో కార్మికుడికి రూ. 3 వేల వరకు జరిమానా వేశారని యాకూబ్ వివరించారు. ఓ వైపు అనారోగ్యంగా ఉన్న వారు విధులకు రావొద్దని చెబుతూనే.. రాలేని వారి పట్ల ఇలా వ్యవహరించడం దారుణమని అన్నారు. వెంటనే కోత విధించిన డబ్బంతా.. కార్మికుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఇదీ చదవండి:కరోనాకు చిక్కొద్దని వ్యవసాయ క్షేత్రాల్లోకి మకాం మారుస్తున్న ధనవంతులు

ABOUT THE AUTHOR

...view details