భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని పెద్దమ్మ తల్లి ఆలయం 79 రోజుల అనంతరం తిరిగి తెరుచుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పొరుగు ఊరు నుంచి సైతం ఆలయానికి విచ్చేశారు. భక్తులు దూరం పాటించేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులు తమ ఇలదైవమైన అమ్మవారిని దర్శించుకుని... పూజలు చేసి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
79 రోజుల అనంతరం పెద్దమ్మ తల్లి దర్శనం... భక్తుల్లో కోలాహలం - నేటి నుంచి తెరుచుకోనున్న ఆలయాలు
లాక్డౌన్ కారణంగా గుడికి దూరమైన భక్తులు... ఇప్పుడు ఆలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటున్నారు. తమ కులదైవాలను సందర్శించుకుని పూజలు చేస్తున్నారు. దూరం పాటిస్తూ... మాస్కులు ధరిస్తూ దైవ భక్తిలో మునిగిపోతున్నారు.
79 రోజుల అనంతరం పెద్దమ్మ తల్లి దర్శనం... భక్తుల్లో కోలాహలం
మాస్కులు ధరిస్తూ... దూరం పాటిస్తూ భక్తులు ఆలయాలకు చేరుకుని పూజలు నిర్వహిస్తున్నారు. కరోనా కష్టకాలం తొలగిపోవాలని పూజలు చేశారు.
ఇవీ చూడండి:కుప్పకూలిన విమానం- ప్రమాదంలో ఇద్దరు మృతి