తెలంగాణ

telangana

ETV Bharat / state

శిథిలావస్థకు చేరిన పెద్దవాగు ప్రాజెక్టు - Repairs

విస్తారంగా కురిసిన వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టులో వరద నీరు భారీగా చేరడం వల్ల గేట్లను ఎత్తి నీటిని వదిలారు. ఈ క్రమంలో ఎత్తిన మూడు గేట్లలో మెుదటి గేటును దించే సందర్భంలో మెురాయించడం వల్ల నీరు వృథాగా పోతోంది. శిథిలావస్థకు చేరిన ఈ ప్రాజెక్టును అధికారులు మరమ్మతులు చేయించడం లేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.

శిథిలావస్థకు చేరిన పెద్దవాగు ప్రాజెక్టు

By

Published : Sep 20, 2019, 10:43 AM IST

రెండు రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడివెల్లి సమీపంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి వదిలారు. ఉన్న మూడు గేట్లలో మెుదటి గేటు దించే క్రమంలో మెురాయించింది. దీని వల్ల నీరు వృథాగా పోతోంది. శిథిలావస్థకు చేరిన ఈ ప్రాజెక్టు గేట్లు మరమ్మతులు చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని స్థానిక రైతులు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ప్రాజెక్టు మీదనే తమ జీవితాలు ఆధారపడి ఉన్నాయని వారు వాపోతున్నారు.

శిథిలావస్థకు చేరిన పెద్దవాగు ప్రాజెక్టు
ఇదీచూడండి:ఐదోరోజూ అన్వేషణ... అయినా దొరకని జాడ

ABOUT THE AUTHOR

...view details