భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. లక్ష్మణ సమేత సీతారాములకు అర్చకులు శత కలశాభిషేకం జరిపారు. నేడు స్వామివారికి అర్చకులు పవిత్రాలు ధరింపజేయనున్నారు. రేపు వరలక్ష్మి వ్రతం సందర్భంగా విశేష తిరుమంజనం నిర్వహిస్తామని అర్చకులు వెల్లడించారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు - భద్రాద్రి ఆలయంలో పవిత్రోత్సవాలు
పవిత్రోత్సవాల్లో భాగంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. రేపు వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
ఉపాలయంలో లక్ష్మీతాయారు అమ్మవారికి విశేష తిరుమంజనం చేస్తామన్నారు. వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం లక్ష్మణ సమేత సీతారాములను బేడా మండపం వద్దకు తీసుకువచ్చి అగ్ని మథనం చేశారు. అనంతరం హోమ శాలలో అగ్ని ప్రతిష్ఠ చేశారు. ఈ నెల 22 వరకు పవిత్ర ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో నిత్య కల్యాణాలు నిలిపివేశారు. దేవతా మూర్తులకు నిర్వహించే కైంకర్యాలల్లో తెలిసీ, తెలియక చోటుచేసుకునే దోషాల నివారణకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు.
ఇదీ చూడండి:TIRUMALA: శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం