తెలంగాణ

telangana

ETV Bharat / state

శిశువులకు చికిత్స అందించట్లేదని భద్రాచలంలో ఆందోళన - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి

నవజాత శిశువులకు రక్త పరీక్షలు నిర్వహించడంలేదని శిశువుల తల్లిదండ్రులు సిబ్బందితో వివాదానికి దిగారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రక్త పరీక్ష కేంద్రం ఉన్నప్పటికీ ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేయడం లేదని నవజాత శిశువుల తల్లిదండ్రులు వైద్యసిబ్బందిని నిలదీశారు.

Breaking News

By

Published : Sep 14, 2020, 8:55 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నవజాత శిశువు చికిత్స కేంద్రం వద్ద నవజాత శిశువుల తల్లిదండ్రులు ఆందోళనకు చేపట్టారు. అనంతరం ఆస్పత్రి వైద్యులతో వివాదానికి దిగారు. కొన్ని రోజులుగా ఆస్పత్రి వైద్యులు రక్త పరీక్షలు బయట చేయించుకోమని చెబుతుండటంపై మండిపడ్డారు.

'పరీక్షలకు బయటకు ఎందుకు వెళ్లాలి ?'

ప్రభుత్వ ఆస్పత్రిలో రక్త పరీక్ష కేంద్రం ఉన్నప్పటికీ ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయడం లేదని నవజాత శిశువుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కొంతమంది తమ దగ్గర ఉన్న కొద్దిపాటి నగదుతో ప్రైవేట్ కేంద్రాల్లో రక్త పరీక్షలు చేయించుకున్నామని పేర్కొన్నారు. రెండు వందల పడకల గది ఉన్న పెద్ద ఏరియా ఆస్పత్రిలో రక్త పరీక్షలు ఎందుకు చేయడం లేదని తల్లిదండ్రులు వైద్య సిబ్బందిని నిలదీశారు.

'ఆదివారాల్లోనే ఎందుకలా ?'

ఆదివారం రోజుల్లో మాత్రమే రక్త పరీక్ష కేంద్రాల్లో సిబ్బంది లేకపోవడం వల్ల... అత్యవసరమైతే రక్త పరీక్షలు బయట చేయించుకోమని చెబుతున్నామని పిల్లల వైద్య నిపుణులు మోహన్ చెప్పుకొచ్చారు. మిగతా రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని సమాధానమిచ్చారు.

ఇవీ చూడండి : రైతు వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలి: నంది రామయ్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details