Papikondalu Excursion to start in two days: భద్రాచలంలో గోదావరి వరదల కారణంగా నాలుగు నెలల క్రితం ఆగిపోయిన పాపికొండల విహార యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. మరో రెండు రోజుల్లో ఈ యాత్ర మొదలవుతుంది రాష్ట్ర పర్యాటక శాఖ ప్రకటించింది. ఈ మేరకు పెద్దలకు 950 రూపాయలు, పిల్లలకు 750 రూపాయలుగా టికెట్ ధరను నిర్ణయించింది. వివిధ ప్రాంతాల నుంచి భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు పాపికొండలను చూసి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో భద్రాచలంలో భక్తుల రద్దీ పెరగడం వల్ల ఆలయానికి ఆదాయం పెరుగుతుంది. అలాగే చిరువ్యాపారులు కూడా తమ వ్యాపారంలో లాభాలు వస్తాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పాపికొండలు విహారయాత్ర పునఃప్రారంభం.. టికెట్ ధర ఎంతంటే? - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు
Papikondalu Excursion to start in two days: గోదావరి వరదల కారణంగా నాలుగు నెలల క్రితం ఆగిపోయిన పాపికొండల యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. రెండురోజుల్లో యాత్ర మొదలవుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రకటించింది. ఈ మేరకు టికెట్ ధరను కూడా నిర్ణయించింది.
Papikondalu Excursion to start in two days