భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో పలు పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్నాయి. బోయ తండా, బోజ్జయిగూడెం, లచ్చగూడెం, మామిడి గూడెం, గుండాల, మిట్టపల్లి, రేపల్లెవాడ, తిలక్ నగర్, విజయలక్ష్మీనగర్, ఒడ్డుగూడెం పంచాయితీల కార్యాలయాలు ప్రభుత్వ పాఠశాలల్లోనే నడుస్తున్నాయి.
పాఠశాలల్లో పంచాయతీలు... విద్యార్థుల అవస్థలు - GOVERNMENT SCHOOLS PROBLEMS
కొన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలకు ప్రభుత్వ పాఠశాలలే కేరాఫ్ అడ్రస్ అవుతున్నాయి. కార్యాలయానికి వచ్చిపోయే వాహనాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పలు పంచాయతీ కార్యాలయాల వల్ల విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
PANCHAYATH OFFICES RUNNING IN GOVERNMENT SCHOOLS AT ILLANDHU
ఫలితంగా విద్యార్థులకు పంచాయతీ కార్యాలయాల వాహనాలతో ఆటస్థలాలు కనుమరుగవుతున్నాయి. మరికొన్నిచోట్ల ఇవి కూడా లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం స్పందించి పంచాయతీ భవనాల నిర్మాణాలు చేపట్టి పాఠశాలలకు విముక్తి కలిగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.