ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు వల్ల కొన్ని గ్రామాల్లో స్థల వివాదాలు నెలకొంటున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మొక్కంపాడు పంచాయతీ పరిధిలో పల్లె ప్రకృతి వనం కోసం ఏర్పాటు చేస్తున్న స్థలం తమదంటూ ఎంపీపీ భూక్యా రాధ ఆమె భర్త.. వారి మనుషులు కలిసి మొక్కలకు రక్షణగా ఏర్పాటు చేసిన స్తంభాలను పీకేయడం వివాదాస్పదంగా మారింది.
గ్రామానికి చెందిన భూమి..
తమ స్థలంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తూ ఉండగా.. రెవెన్యూ శాఖ అధికారులు సూచించిన స్థలంలో ఇరవై రోజుల క్రితమే మొక్కలు పెట్టడం జరిగిందని.. ఎంపీపీ అనుచరలు వచ్చి స్తంభాలను పీకేశారని సర్పంచ్ విజయ తెలిపారు.
ప్రభుత్వ స్థలాలు లభ్యత లేక కొన్ని చోట్ల.. అటవీ స్థల వివాదం మరికొన్ని చోట్ల.. దొరికిన స్థలాల్లో హద్దుల గోలలు ఇలా.. మొత్తంమీద పల్లెల్లో ప్రశాంత వాతావరణం కోసం ప్రభుత్వం నెలకొల్పదలచిన పల్లె ప్రకృతి వనాలు కాస్త పలు గ్రామాలలో వివాదాస్పదంగా వాతావరణాన్ని ఏర్పరుస్తున్నాయి.
ఇదీ చూడండి:కాంగ్రెస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: కొండా సురేఖ