రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పల్లెటూరుకు పట్టణానికి ప్రకృతి వనాలు ఉండాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు తోడ్పడతాయన్న సదుద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈవనాలు ఏర్పాటు ద్వారా విరివిగా వర్షాలు కురవడానికి ఆస్కారం ఉంటుందని సూచించింది. దీనితో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పల్లె ప్రకృతి వనం అందంగా ముస్తాబవుతోంది. ఈపల్లె ప్రకృతి వనానికి భద్రాచలంలో సుమారు రూ.12 లక్షల నిధులను కేటాయించి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆహ్లాదకర వాతావరణాన్ని ఇచ్చే పెద్దపెద్ద వృక్షాల నడుమ ఈ వనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడియం నుంచి రంగురంగుల పూల మొక్కలను తీసుకువచ్చి పల్లె ప్రకృతి వనంలో నాటుతున్నారు.
సుందరంగా ముస్తాబైన భద్రాచలంలోని పల్లె ప్రకృతి వనం - భద్రాచలంలో అందంగా ముస్తాబవుతున్న పల్లె ప్రకృతి వనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పల్లె ప్రకృతి వనాన్ని అధికారులు ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. చిన్నలనూ పెద్దలనూ ఆకట్టుకునేలా రకరకాలపూలతో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా అందంగా ముస్తాబుచేస్తున్నారు. త్వరలోనే మంత్రుల చేతుల మీదుగా వనాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తైయినట్లు పేర్కొంటున్నారు.
సుందరంగా ముస్తాబైన భద్రాచలంలోని పల్లె ప్రకృతి వనం
చిన్న పిల్లలను, పెద్దలను ఆకట్టుకునే విధంగా ఈ పకృతి వనాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనాన్ని మంత్రి అజయ్‌కుమార్ చేతిమీదుగా త్వరలో ప్రారంభోత్సవం చేస్తామని భద్రాచలం పంచాయతీ ఈవో ప్రసాద్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి:'మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం'