తెలంగాణ

telangana

ETV Bharat / state

జోరుగా కొనసాగుతున్న పల్లా రాజేశ్వర్​ రెడ్డి ప్రచారం - Palla Rajeshwar Reddy election campaign

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఖమ్మం-నల్గొండ-వరంగల్ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. ఉదయం వ్యాయామానికి వచ్చిన వారిని కలిసి ఓట్లు అభ్యర్థించారు.

Palla Rajeshwar Reddy campaign in full swing in bhadradri Kothagudem district
జోరుగా కొనసాగుతున్న పల్లా రాజేశ్వర్​ రెడ్డి ప్రచారం

By

Published : Mar 4, 2021, 12:57 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉదయపు నడకకు వెళ్లే వారితో తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ముచ్చటించారు. మొదటి ప్రాధాన్యత ఓటు తనకే వేయాలని పట్టభద్రులను కోరారు.

రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పల్లా అన్నారు. ఆయన వెంట మున్సిపల్ ఛైర్​పర్సన్ సీతాలక్ష్మి, తెరాస రాష్ట్ర నాయకుడు వనమా రాఘవ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:యాదాద్రికి బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details