భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వేపాలగడ్డ నుంచి పగిడిద్దరాజు బృదం బయలుదేరింది. డప్పు వాయిద్యాల నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారానికి పడగ రూపంలో ఉన్న పగిడిద్ద రాజును తీసుకొస్తారు. వీళ్ళ ప్రయాణం అంతా అటవీ ప్రాంతంలో 24 గంటలపాటు కాలినడకన సాగుతుంది. ఈ రాత్రికి మేడారం చేరుకోనున్నట్లు పూజరి కాంతారావు వెల్లడించారు.
నేడు మేడారానికి పగిడిద్దరాజు - Medaram jatara 2020
అంబరాన్నంటే సంబురానికి ముహూర్తం సమీపించింది. కీకారణ్యం జనారణ్యంగా మారే సమయం వచ్చేసింది. బుధవారం మేడారం మహా జాతర ఘనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజును ఇవాళ మేడారానికి తీసుకురానున్నారు.
నేడు మేడారానికి పగిడిద్దరాజు