భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికలు నేడు నిర్వహిస్తున్నారు. ఈనెల 15న ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా 40 మంది సభ్యులకు గానూ 20 మంది సభ్యులు హాజరయ్యారు. అయితే కనీసం 27 మంది సభ్యులు ఉంటేనే కోరం నిర్వహించేందుకు అవకాశం ఉండగా ఆ రోజు ఎన్నికలను నేటికి వాయిదా వేశారు.
నేడు భద్రాచలం సహకార సంఘాల ఎన్నికలు
భద్రాచలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో కాకుండా చేతులెత్తే పద్ధితిలో అభ్యర్థిని ఎన్నుకోనున్నారు.
నేడు జరుగనున్న భద్రాచలం సహకార సంఘాల ఎన్నికలు
అయితే 50 మంది కంటే తక్కువ ఉండటం వల్ల బ్యాలెట్ పద్ధతిలో కాకుండా చేతులెత్తి అభ్యర్థిని ఎన్నుకునే విధానంలో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారి శ్రీనివాసరావు తెలిపారు. రెండున్నర గంటలకు చేతులెత్తే పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు.