భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాగులు ఉప్పొంగడం వల్ల గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. మండలంలోని పలు గ్రామాల్లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అశ్వారావుపేట మండలంలో భారీ వర్షాల కారణంగా పెద్దవాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు.
పొంగిపొర్లుతున్న వాగులు వంకలు - భద్రాద్రి కొత్తగూడెం
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.
పొంగిపొర్లుతున్న వాగులు వంకలు