తెలంగాణ

telangana

ETV Bharat / state

Badradri Ramaiah Oniline Services : భక్తులకు గుడ్​ న్యూస్​.. ఆన్​లైన్​లో​ భద్రాద్రి రామయ్య

Online Bhadradri Ramaiah services : భద్రాద్రి రామయ్య సేవలను ఆన్​లైన్​ ద్వారా పొందవచ్చని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఈ మేరకు ఆన్​లైన్​ సేవలను ప్రారంభించారు. ఆలయానికి విరాళాలు ఇచ్చే భక్తులు ఎవరైనా ఇకపై ఆన్​లైన్​ ద్వారా చెల్లించవచ్చని చెప్పారు. ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలు, సేవలు ఆన్​లైన్​ ద్వారా బుక్​ చేసుకోవాలని కోరారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 4, 2023, 6:18 PM IST

Badradri Ramaiah Official Website : భద్రాద్రి రామయ్య సన్నిధిలోని ఆలయంలో జరిగే అన్ని పూజలు, సేవలు ఆన్​లైన్​ అందుబాటులోకి వచ్చాయి. ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి సాయంత్రం వరకు జరిగే అన్ని సేవల్లో,పూజల్లో భక్తులు ఆన్​లైన్​ ద్వారా బుక్ చేసుకుని.. నేరుగా పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చనని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఈ సేవలను www.bhadradritemple.telangana.gov.inవెబ్​సైట్​ని సందర్శించి.. భక్తలకు నచ్చిన సమయంలో కావల్సిన సేవను బుక్​ చేసుకోవచ్చని వెల్లడించారు.

Bhadradri Temple Introduce Online Services : ఆన్​లైన్​లో ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్​ చేసుకునే సదుపాయం కల్పించారని అన్నారు. భద్రాద్రి రామయ్య ఆలయ ఆన్​లైన్​ టిక్కెట్లను ఈవో ప్రారంభించారు. ఈ సేవల కోసం గత రెండు నెలలుగా ఆలయ సిబ్బందికి శిక్షణ ఇప్పించి అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఆన్​లైన్​లో గుడిలో జరిగే నిత్య కల్యాణం, ప్రత్యేక దర్శనం, అర్చనలు, వెండి రథ సేవ, దర్బారు సేవ వంటి పూజల్లో పాల్గొనవచ్చు అని అన్నారు. వాటితో పాటు భక్తులు ఆలయానికి సంబంధించిన అన్నదానానికి.. గోశాలకు, ఆలయ అభివృద్ధికి విరాళాలు ఇవ్వాలనుకున్న దాతలు ఆన్​లైన్​ ద్వారా చెల్లించవచ్చని చెప్పారు.

Devotional day celebrations in bhadrachalam : భద్రాద్రి రామయ్య సన్నిధిలో కన్నులపండుగగా ఆధ్యాత్మిక ఉత్సవాలు

Online Services of Badradri Temple : భక్తులంతా జులై 4 నుంచి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. రామయ్య సేవలను నేరుగా, ఆన్​లైన్​ ద్వారా ఈ సేవలను వినియోగించుకొని.. స్వామివారిని దర్శించుకోవచ్చు అని అన్నారు. భద్రాద్రి టెంపుల్​ వెబ్​సైట్​ ఓపెన్​ చేసి ఆన్​లైన్​ బుకింగ్స్​లోకి వెళ్లి భక్తులకు కావలిసిన సేవను బుక్​ చేసుకోవచ్చని వివరించారు. వెబ్​సైట్లో​ ఏ సమయంలో ఏ పూజ జరుగుతుందో.. సేవ లేదా పూజా టికెట్​ ధరలను అందుబాటులో ఉంచారు. రాబోయే కాలంలో భక్తులకి మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు.

"సీతారాముల సేవలు ప్రజలందరికి అందాలనే ఉద్దేశంతో భద్రాద్రి దేవాలయానికి కొత్త వెబ్​సైట్​ రూపొందించి.. ఆన్​లైన్​ సేవలను, పూజలను ప్రారంభించాం. రాష్ట్ర ప్రభుత్వం సాకారంతో ఈ సేవలను తొందరగా భక్తులకు తీసుకువచ్చాం. భక్తులందరు దేవస్థానం అధికార వెబ్​సైట్​ని ఓపెన్​ చేసి ఆన్​లైన్​ టికెట్లని పొందవచ్చు. అధిక మొత్తంలో భక్తులకి రామయ్య సేవలు అందేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆన్​లైన్​ ప్రత్యేక దర్శనం, సుప్రభాత సేవ.. ఇలా అన్ని సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. భక్తులు నేరుగా టికెట్లు పొందవచ్చు. ఎవరైనా దాతలు ఉంటే ఆన్​లైన్​ ద్వారా అందజేసేందుకు వీలు కల్పించాం. ఈ అవకాశాన్ని భక్తులు అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను."- రమాదేవి, భద్రాద్రి ఆలయ కార్య నిర్వహణ అధికారి

ఆన్​లైన్​ సేవలను ప్రారంభించిన భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details