భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చి దేవతా మూర్తులను దర్శించుకుంటున్నారు.
దర్శన భాగ్యం..
దూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో దేవాస్థానం కిటకిటలాడుతోంది. ఉచిత దర్శనానికి సుమారు గంటకుపైగా సమయం పడుతోంది. స్వామి దర్శన భాగ్యం కోసం జనం క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు.