వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన చీమల సతీశ్ అనే వ్యక్తి ఇంటిముందు ముగ్గుతో బొమ్మను గీసి, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ సంఘటనతో ఇంటి బయట పడుకున్న సతీశ్ కనిపించకుండా పోయాడు.
Missing: క్షుద్రపూజల కలకలం.. వ్యక్తి అదృశ్యం - ఓ వ్కక్తి అదృశ్యం
క్షుద్రపూజలు కలకలం రేపాయి. వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలో ఓ ఇంటిముందు ఆనవాళ్లు కనిపించాయి. ఈ సంఘటనతో బయటే పడుకున్న వ్యక్తి అదృశ్యమైపోయాడు.
వరంగల్ గ్రామీణ జిల్లాలో క్షుద్రపూజల కలకలం
గతకొన్ని రోజులుగా సతీశ్ భార్య, పిల్లలతో కలిసి రాయపర్తి గ్రామంలోని తన తల్లి ఇంటివద్దే ఉంటోంది. దీంతో సతీశ్ ఒక్కడే ఇంటిదగ్గర ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అతను అదృశ్యం కావడం గ్రామంలో చర్చకు దారితీసింది. ఆయన ఇంటిముందు తానే క్షుద్రపూజలు చేశాడా.. లేదా మరెవరైనా సతీశ్‌ను ఏమైనా చేసి ఉంటారా అని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: KTR RESPOND:ఈటీవీ భారత్ కథనానికి స్పందన... ఆ చిన్నారులకు కేటీఆర్ ఆపన్నహస్తం
Last Updated : Jun 10, 2021, 9:57 PM IST