రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు - accident
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించగా... పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఖమ్మం తరలించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి కొత్తగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. బొజ్జగూడెం దాటిన తర్వాత ద్విచక్ర వాహనంపై ఇల్లందు వైపు వస్తున్న ధరావత్ భద్రు అనే వ్యక్తిని ఇల్లందు నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ధరావత్ భద్రు తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించగా... పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తలకు తీవ్ర గాయం కూడా కావడం వల్ల మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు.
ఇవీ చూడండి: వివాహ వేడుకకు వెళ్తూ... అనంతలోకాలకు...