తెలంగాణ

telangana

ETV Bharat / state

వైకుంఠధామం నిర్మాణంలో అపశ్రుతి.. ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తికి గాయాలు - badradri kothagudem news

వైకుంఠధామం నిర్మాణంలో భాగంగా వినియోగిస్తున్న ట్రాక్టర్​ ట్యాంకర్​ బోల్తాపడి ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మసివాగు గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది.

one man injured in tractor accident at masivagu village
one man injured in tractor accident at masivagu village

By

Published : Jul 19, 2020, 5:06 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మసివాగు గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టిన వైకుంఠధామం నిర్మాణంలో అపశ్రుతి చోటు చేసుకుంది. నిర్మాణంలో వినియోగిస్తున్న ట్రాక్టర్ ట్యాంకర్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తారాచంద్​కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా... క్షతగాత్రున్ని ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తీసుకెళ్లారు.

ఇదీ చూడండి:బీసీజీ టీకా కరోనా నుంచి రక్షిస్తుందా?

ABOUT THE AUTHOR

...view details