భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూక్య నాగు తన మొదటి భార్య నాగమణి, ఆమె అల్లుడు సురేశ్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. పదిహేనేళ్ల క్రితం విడిపోయిన నాగమణికి నాగు ఎకరం పొలం రాసిచ్చాడు. తర్వాత ఆమె స్వగ్రామం ములకలపల్లి మండలం సీతానగరంలో ఉంటుంది. భర్త తనకు ఇచ్చిన పొలాన్ని.. కుమార్తెకు రాసిచ్చింది. భూ ప్రక్షాళనలో భాగంగా ఇటీవలే పట్టా రావడం వల్ల నాగుకి ఆశ పుట్టింది. భూమిలో కొలతలు వేయించేందుకు నాగమణి తన అల్లుడు సురేశ్‌ని తీసుకెళ్లింది. విషయం తెలుసుకున్న నాగు అక్కడికొచ్చి గొడవకు దిగాడు. ఈ సమయంలో నాగు అకస్మాత్తుగా కత్తితో వారిద్దరిపై దాడికి పూనుకున్నాడు. ఈ దాడిలో సురేశ్ అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరిని అశ్వరావుపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలించారు.
ఆస్తి కోసం భార్యా, అల్లుడిపై దాడి - ఆస్తి కోసం భార్యా, అల్లుడిపై దాడి
భూమిపై ఆశతో తన మొదటి భార్య, ఆమె అల్లుడిపై దాడికి దిగాడో వ్యక్తి. రాసిచ్చిన పొలాన్నే తనకు వదిలేయాలని భూక్య నాగు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకుంది.
ఆస్తి కోసం భార్యా, అల్లుడిపై దాడి