భద్రాచలంలోలో ఈ నెల 21న జరగనున్న సీతారాముల కల్యాణ వేడుకకు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం దశమ కోటి తలంబ్రాలను అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 400 మంది భక్తులు గోటితో ఒలిచిన 250 కేజీల బియ్యాన్ని భద్రాద్రి రామయ్యకు సమర్పించారు. గత పదేళ్లుగా ప్రతి యేటా సీతారాముల కల్యాణం కోసం ప్రత్యేకంగా వరి పండించి ఆ వడ్లను గోటితో ఒలిచి స్వామివారికి సమర్పిస్తున్నారు.
భద్రాద్రి రామయ్య కల్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలు
భద్రాద్రి రామయ్య కల్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలు సిద్ధమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 400 మంది మహిళలు గోటితో ఒలిచిన 250 కేజీల బియ్యాన్ని స్వామి వారి కల్యాణంలో తలంబ్రాలుగా వాడనున్నారు. గత పదేళ్లుగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో స్వామి వారికి తలంబ్రాలను అందజేస్తున్నారు.
రామయ్య కల్యాణానికి కోటి తలంబ్రాలు
రామయ్య సన్నిధికి తీసుకువచ్చిన తలంబ్రాలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ఈవో శివాజీకి సంఘం అధ్యక్షులు కల్యాణ అప్పారావు తలంబ్రాలను అందించారు.
ఇదీ చదవండి:ఆదరణ కోల్పోయిన కళ.. భిక్షమెత్తుకుంటున్న కళాకారుడు