భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ తాండలో 10 ఏళ్ల బాలికిపై 50 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారం చేయబోయాడు. బాలికకు మాయమాటలు చెప్పి డాబాపైకి తీసుకువెళ్లి అత్యాచారానికి యత్నిస్తుండగా తల్లి గమనించింది. చిన్నారిని కాపాడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన చుంచుపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
10 ఏళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం - బాలికపై అత్యాచారయత్నం
కాటికి కాళ్లు చాపుకున్న ఓ కామాంధుడు 10 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ తాండలో జరిగింది. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం
TAGGED:
బాలికపై అత్యాచారయత్నం