వరదలో చిక్కుకున్న 20 కుటుంబాలు.. కాపాడిన అధికారులు - వరదలో చిక్కుకున్న కుటుంబాలను కాపాడిన అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో... వరదలో చిక్కుకున్న 20 కుటుంబాలను తెప్పల సాయంతో అధికారులు కాపాడారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో కోడిపుంజుల వాగు ఉప్పొంగింది.
![వరదలో చిక్కుకున్న 20 కుటుంబాలు.. కాపాడిన అధికారులు వరదలో చిక్కుకున్న 20 కుటుంబాలు.. కాపాడిన అధికారులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:10:41:1597938041-tg-kmm-17-20-bditulanu-kaapadina-adhikaarulu-av-ts10046-20082020202055-2008f-1597935055-40.jpg)
వరదలో చిక్కుకున్న 20 కుటుంబాలు.. కాపాడిన అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురులో బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షానికి కోడిపుంజుల వాగు పొంగి… అశోకనగర్లోని 20 కుటుంబాలు వరదలో చిక్కుకున్నాయి. వెంటనే స్పందించిన రెవెన్యూ, పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు… గోదావరి ఒడ్డున ఉన్న జాలర్ల తెప్పలను తెప్పించి ఒడ్డుకు చేర్చారు.