తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇల్లందు సహకార ఎన్నికల తుది జాబితాలో జాప్యం - భద్రాద్రి కొత్త గూడెం జిల్లా తాజా వార్త

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సహకార ఎన్నికల అభ్యర్థుల తుది జాబితా ప్రకటనపై న్యూడెమోక్రసీ పార్టీ అభ్యంతరం తెలిపింది. నోటీసు బోర్డు వేయకముందే ఎన్నికల అధికారి కొంత మందిని అర్హులని ఎలా ఖరారు చేస్తారంటూ నిరసన వ్యక్తం చేసింది.

Objections to the Final List of pacs election in bhadradri kothagudem
ఇల్లందు సహకార ఎన్నికల తుది జాబితాలో జాప్యం

By

Published : Feb 10, 2020, 9:21 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు గాను మొత్తం 41 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నోటీసు బోర్డు మీద వివరాలు వెయ్యక ముందే వారిలో 37 మంది అభ్యర్థులను అర్హులని ఎన్నికల అధికారి పద్మరాజు ప్రకటించారు.

తెరాస పార్టీ మద్ధతుదారుల అభ్యర్థి కోసం మరో రెండు పేర్లు కలిపి 39 పేర్లను ప్రకటించారని న్యూడెమోక్రసీ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. సహకార సంఘ కార్యాలయం ముందు పోలీసుల సమక్షంలోనే ఎన్నికల అధికారితో వాగ్వాదానికి దిగారు.

తనపై ఎవరి ఒత్తిడి లేదని 39 మంది అభ్యర్థులతో కూడిన తుది జాబితాను నోటీసు బోర్డు వేశానని ఎన్నికల అధికారి తెలిపారు.

ఇల్లందు సహకార ఎన్నికల తుది జాబితాలో జాప్యం

ఇదీ చూడండి: సూర్యాపేట జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు

ABOUT THE AUTHOR

...view details