భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, పార్టీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు హాజరయ్యారు. ఆరు నెలల్లో పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఫారెస్ట్ అధికారులతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసిల భూముల్లో దాడులు చేస్తున్నారని వారు ఆరోపించారు.
పోడు భూముల సమస్యపై న్యూ డెమోక్రసీ పోరుబాట - ఇల్లందులో న్యూ డెమోక్రసీ పార్టీ సమావేశం
ప్రభుత్వం వెంటనే పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని న్యూ డెమెక్రసీ పార్టీ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సమావేశం నిర్వహించింది.
![పోడు భూముల సమస్యపై న్యూ డెమోక్రసీ పోరుబాట పోడు భూముల సమస్యపై న్యూ డెమోక్రసీ పోరుబాట](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6154527-thumbnail-3x2-podu.jpg)
పోడు భూముల సమస్యపై న్యూ డెమోక్రసీ పోరుబాట
ప్రభుత్వం వెంటనే పోడు భూముల సమస్యలను పరిష్కరించి రైతులకు పట్టాలు ఇవ్వాలని నాయకులు కోరారు. అదేవిధంగా తునికాకు టెండర్లు ఇప్పటివరకు పిలవలేదని.. అడవుల్లో తునికాకు సేకరణకు ఆదివాసీలను దూరం చేసే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
పోడు భూముల సమస్యపై న్యూ డెమోక్రసీ పోరుబాట