భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మెుదటి రోజు ప్రత్యేక శ్రద్ధ వహించిన వైద్య సిబ్బంది... రెండో రోజు మాత్రం శుభ్రతను గాలికొదిలేశారు. పరీక్ష కేంద్రానికి వచ్చిన వారిని వచ్చినట్లుగా లోపలికి పంపించకుండా.. విద్యార్థులను సమూహాలుగా బయటే నిల్చోబెట్టారు.
మొదటి రోజు శ్రద్ధ.. రెండో రోజు నిర్లక్ష్యం - ఇల్లందులో పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో అధికారులు నిర్లక్ష్యం
భద్రాద్రి జిల్లా ఇల్లందులో పదో తరగతి కేంద్రాల్లో శుభ్రతను గాలికొదిలేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా విద్యార్థులను సమూహంగా నిల్చొబెట్టారు. మొదటి రోజు ప్రత్యేక శ్రద్ధ వహించినా రెండో రోజు మాత్రం నిర్లక్ష్యం వహించారు.
![మొదటి రోజు శ్రద్ధ.. రెండో రోజు నిర్లక్ష్యం మొదటి రోజు శ్రద్ధ.. రెండో రోజు నిర్లక్ష్యం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6477388-thumbnail-3x2-d.jpg)
మొదటి రోజు శ్రద్ధ.. రెండో రోజు నిర్లక్ష్యం
మొదటి రోజు శ్రద్ధ.. రెండో రోజు నిర్లక్ష్యం
కరోనా వ్యాప్తి దృష్ట్యా అవగాహన కల్పించకుండా గుంపులుగా ఉంచడమేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇల్లందులో మొత్తం 8 పరీక్షా కేంద్రాల్లో పన్నెండు వందల మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కరోనా ప్రభావంతో ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇవీ చూడండి:'సంకల్పం, సంయమనంతోనే కరోనాపై విజయం'