భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బత్తినపల్లి గ్రామంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గ్రామంలో రహదారి పనులు చేస్తున్న రెండు వాహనాలకు నిప్పంటించారు.
రోడ్డు రోలర్, ట్రాక్టర్ను తగులబెట్టారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా మావోయిస్టు డివిజన్ కార్యదర్శి ఆజాది పేరుతో మంగళవారం లేఖలు విడుదల చేసిన మావోయిస్టులు... నేడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.