భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో జరిగిన దేవి నవరాత్రుల పూజా కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
టేకులపల్లిలో భక్తిశ్రద్ధలతో దేవి నవరాత్రి ఉత్సవాలు - జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య
భద్రాద్రి కొత్తగూడెం టేకులపల్లిలో జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య దంపతులు దేవి నవరాత్రుల కార్యక్రమంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవిశరన్నవరాత్రుల్లో భాగంగా ఇల్లెందు సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మరో కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ పీవీ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

దేవి నవరాత్రుల పూజా కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మన్
ఇల్లెందు సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవీశరన్నవరాత్రుల పూజలో ఏరియా జనరల్ మేనేజర్ పీవీ సత్యనారాయణ దంపతులు పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణికి చెందిన అధికారులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.