భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఆరో రోజున లక్ష్మీ తాయారు అమ్మవారిని విజయలక్ష్మీ అవతారంలో అలంకరించారు. అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించి.. లక్ష కుంకుమార్చన నిర్వహించారు.
విజయలక్ష్మీ అవతారంలో లక్ష్మీతాయారు అమ్మవారు - sree seethrama swamy temple in Bhadrachalam
భద్రాద్రి రామయ్య సన్నిధిలో దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. లక్ష్మీతాయారు అమ్మవారిని విజయలక్ష్మీ అవతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విజయలక్ష్మీ అవతారంలో కనువిందు చేస్తున్న లక్ష్మీతాయారు అమ్మవారు
విజయలక్ష్మీ అవతారంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. ఈ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల విజయాలు చేకూరతాయని ఆలయ అర్చకులు చెబుతున్నారు.
- ఇదీ చదవండి :సూర్యప్రభ వాహనంపై అభయమిచ్చిన తిరుమలేశుడు