భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. లక్ష్మీ తాయారు అమ్మవారు నేడు ఐశ్వర్యలక్ష్మీగా దర్శనమిచ్చారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం జరిపారు. మధ్యాహ్నం లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఐశ్వర్యలక్ష్మీ అలంకారంలో లక్ష్మీ తాయారు
భద్రాచలంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు ఐశ్వర్యలక్ష్మీగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఉదయం పంచామృతాలతో అభిషేకం జరిపారు. మధ్యాహ్నం లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
ఐశ్వర్యలక్ష్మీ అలంకారంలో లక్ష్మీ తాయారు
శుక్రవారాన్ని పురస్కరించుకొని ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములు బంగారు కవచాలతో దర్శనమిస్తున్నారు. రేపు వీరలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తులతో ఆలయం ప్రాంగణం కిటకిటలాడుతోంది.
ఇదీ చదవండి:సర్వభూపాల వాహనంపై శ్రీవారి అభయప్రదానం
Last Updated : Oct 23, 2020, 1:22 PM IST