భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి గనుల్లో సమ్మె ప్రారంభమైంది. బొగ్గు బ్లాకులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ఉద్ధేశంతో 41 బ్లాకులను కేంద్రం వేలం వేసిందని ఆరోపిస్తూ... ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్, హెచ్ఎంఎస్ల ఆధ్వర్యంలో మూడు రోజుల సమ్మె ప్రారంభమైంది.
సమ్మె సైరన్.. సింగరేణిలో మూడురోజుల నిరసనలు షురూ - భద్రాద్రి సింగరేణిలో ప్రారంభమైన సమ్మె
బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఐదు జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె ప్రారంభమైంది. గుర్తింపు కార్మిక సంఘమైన టీజీబీకేఎస్ ఒకరోజు సమ్మెకు మద్దతు తెలిపింది.
కొత్తగూడెం సింగరేణిలో సమ్మె ప్రారంభం
మొదటిరోజు సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోంది. ఈ సమ్మెకు సింగరేణి గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఒకరోజు మద్దతు తెలిపింది. అత్యవసర కార్మికులు మినహా మిగిలిన వారెవరూ విధులకు హాజరు కావడం లేదు. కొద్దిమంది కార్మికులతో ఉపరితల గనుల్లో ఉత్పత్తి కోసం యాజమాన్యం ప్రయత్నిస్తోంది.