కల్యాణ లక్ష్మి సమస్యను ప్రజాప్రతినిధుల ముందు ఉంచి రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలని ముత్యాలంపాడు సర్పంచ్ డిమాండ్ చేశారు. తహసీల్దార్ సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న చెక్కులపై రెవెన్యూ అధికారులు వివరణ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ, జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
'కల్యాణలక్ష్మి అర్హులని ఎలా తేలుస్తారు? భూమి ప్రస్తావన ఉందా?' - భద్రాద్రి కొత్తగూడెం అప్డేట్స్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హరిప్రియ, జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య హాజరయ్యారు. కల్యాణలక్ష్మి సమస్యలపై ముత్యాలంపాడు సర్పంచ్ రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు.
'కల్యాణ లక్ష్మీ అర్హులని ఎలా తేలుస్తారు? భూమి ప్రస్తావన ఉందా?'
భూములు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో 2019లో కల్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వలేదని... రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ముత్యాలంపాడు సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకంలో భూముల ప్రస్తావన ఉందా అని ప్రశ్నించారు. అర్హులని ఎలా తేలుస్తారో చెప్పాలని సభా వేదికపై సర్పంచ్ డిమాండ్ చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ చెక్కులు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య సూచించారు.
ఇదీ చదవండి:నేడు హస్తినకు ముఖ్యమంత్రి కేసీఆర్