భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పాత ఎల్ఐసీ రోడ్డులోని ముత్యాలమ్మ ఆలయం ఉగాది వేడులకు సిద్ధమైంది. జాతర ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
ఉగాది జాతరకు సిద్ధమైన ముత్యాలమ్మ ఆలయం - ఉగాది పర్వదినం
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ముత్యాలమ్మ ఆలయం వేడుకలకు ముస్తాబైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కమిటీ అధ్యక్షుడు తెలిపారు.
![ఉగాది జాతరకు సిద్ధమైన ముత్యాలమ్మ ఆలయం Ugadi celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11365379-711-11365379-1618141411294.jpg)
భద్రాచలం
ప్రతి ఏడాది ఉగాది పర్వదినాన.. ముత్యాలమ్మ వారిని మేళతాళాల నడుమ గోదావరి నదికి తీసుకెళ్తారు. స్నానం ఆచరింపజేసి పుర వీధుల్లో ఊరేగిస్తారు. కొన్నెళ్లుగా ఇది ఇక్కడ ఆచారంగా కొనసాగుతోంది. ఈ ఏడాది ఆలయ అభివృద్ధికి సాయపడిన దాతలకు.. ఆలయ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:సొంతూళ్లకు వలస కూలీల పయనం.. ఆ భయంతోనే?