తెలంగాణ

telangana

ETV Bharat / state

'ముంపు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి' - godavari flooded

గోదావరి నది ముంపు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. అశ్వాపురం మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.

Breaking News

By

Published : Aug 15, 2020, 6:41 PM IST

గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతున్నందున ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. అశ్వాపురం మండలంలో గోదావరి వరద ముంపుకు గురయ్యే నెల్లిపాక, ఆనందాపురం, చింతిర్యాల, అమెర్దా, అమ్మగారిపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. 100 ఎకరాల్లో నీట మునిగిన వరి, పత్తి పంటలను పరిశీలించారు.

వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చూడాలని అధికారులను సూచించారు.

ఇదీ చూడండి:'ఆత్మనిర్భర భారత్​... 130 కోట్ల మంది సంకల్పం'

ABOUT THE AUTHOR

...view details