భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ప్రధాన రహదారి డివైడర్ల మీద పెంచిన మొక్కలకు నిత్యం నీరు అందించడం కష్టంగా మారింది. స్పందించిన పురపాలక ప్రజాప్రతినిధులు రహదారి పక్కన 11వ వార్డులో బోరు వేయించారు.
బోరుతో మొక్కలకు తీరనున్న నీటి కష్టాలు - bhadradri kothagudem latest news
డివైడర్ల మీద మొక్కలకు నీటి కోసం ఇల్లందు పురపాలక ప్రజా ప్రతినిధులు, అధికారులు బోరు వేయించారు. దీని ద్వారా అన్ని మొక్కలకు నీరు అందించవచ్చని పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు అన్నారు. నీరు పుష్కలంగా వస్తుండటంతో వారు హర్షం వ్యక్తం చేశారు.
బోరుతో మొక్కలకు తీరనున్న నీటి కష్టాలు
మొక్కలకు నీళ్లు అందించే పని సులభమవుతుందని.. అన్ని మొక్కలకు నీరు అందించే అవకాశం లభిస్తుందని పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు అన్నారు. బోరు నుంచి నీరు పుష్కలంగా వస్తుండటంతో వారు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: బుడ్డోడి ఫీట్లకు కేటీఆర్ ఫిదా.. ట్విట్టర్లో అభినందనలు