కరోనా కట్టడికి అందరూ సహకరించాలని ఇల్లందు పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అఖిలపక్ష నాయకులు, పట్టణంలోని వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయని... అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. వ్యాపారులు నిబంధనలు విధిగా పాటించాలని సూచించారు.
'కరోనా కట్టడికి అందరూ సహకరించాలి'
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఇల్లందు పట్టణంలోని వ్యాపారులు, నాయకులతో ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు. అందరూ సహకరించాలని ఆయన కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అధికారులు, వ్యాపారులతో మున్సిపల్ ఛైర్మన్ సమావేశం, ఇల్లందులో కరోనా
పట్టణంలో మధ్యాహ్నం రెండు గంటల వరకే వ్యాపార కార్యకలాపాలను నిర్వహించాలని ఆదేశించారు. రాజకీయాలకతీతంగా నేతలు కట్టడి చర్యల్లో భాగస్వాములు కావాలని కోరారు. అందరి సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని అన్నారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, వ్యాపారులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:స్వచ్ఛంద లాక్‌డౌన్ విధించుకుంటున్న గ్రామాలు