తెలంగాణ

telangana

ETV Bharat / state

ముక్కోటి ఉత్సవాలకు ముస్తాబైన భద్రాద్రి - నేడు మత్స్యావతారంలో రామయ్య దర్శనం - భద్రాచలం ముక్కోటి ఉత్సవాలు డిసెంబర్ 13న ప్రారంభం

Mukkoti Utsavalu At Bhadrachalam 2023 : భద్రాద్రిలో ఘనంగా నిర్వహించే శ్రీ సీతారామచంద్ర స్వామివారి ముక్కోటి ఉత్సవాలు ఇవాళ ప్రారంభ కానున్నాయి. ఈ ఉత్సవాలు డిసెంబరు ఈరోజు నుంచి జనవరి 2వ తేదీ వరకు కొనసాగునున్నాయి. అధిక సంఖ్యలో పాల్గొనెే ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు వెల్లడించారు.

Bhadrachalam Mukkoti Utsavalu Starts From December 13th
Bhadrachalam Mukkoti Utsavalu Starts From December 13th

By ETV Bharat Telangana Team

Published : Dec 13, 2023, 6:40 AM IST

ముక్కోటి ఉత్సవాలకు ముస్తాబైన భద్రాద్రి - నేడు మత్స్యావతారంలో రామయ్య దర్శనం

Mukkoti Utsavalu At Bhadrachalam 2023 :భారతదేశంలోనే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఇవాళ్టి నుంచి ముక్కోటి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏడాది భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రెండు ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. అందులో ఒకటి శ్రీరామనవమి మరొకటి ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఈరోజు ప్రారంభమై జనవరి 2వ తేదీ వరకు జరగనున్నాయి.

Bhadrachalam Mukkoti Utsavalu 2023 :డిసెంబర్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పగలుపత్తు ఉత్సవాలు (పగటిపూట నిర్వహించే ఉత్సవాలు) జరుపుతారు. 23 నుంచి జనవరి 2వ తేదీ వరకు రాపత్తు ఉత్సవాలు (రాత్రిపూట నిర్వహించే ఉత్సవాలు) నిర్వహిస్తారు. ఈరోజు నుంచి మొదలయ్యే ఉత్సవాల్లో శ్రీ సీతారామచంద్ర స్వామి రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 21 వరకు దశావతారాల్లో స్వామి వారిని అలంకరిస్తారు.

మత్స్యావతారంలో రామయ్య కనువిందు :ఉత్సవాల్లో మొదటి రోజైన నేడు మత్స్యావతారంలో రామయ్య దర్శనమిస్తారు. రెండోవ రోజు కూర్మావతారం, మూడవరోజు వరాహావతారం, నాలుగవ రోజు నరసింహావతారం, ఐదో రోజు వామనావతారం, ఆరవ రోజు పరశురామా అవతారం, ఏడవ రోజు శ్రీరామ అవతారం, ఎనిమిదవ రోజు బలరామావతారం, తొమ్మిదవ రోజు శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు కనువిందు చేయనున్నారు.

సంతాన లక్ష్మీగా భద్రాద్రి అమ్మవారి దర్శనం.. పోటెత్తిన భక్తజనం

డిసెంబర్ 22న పవిత్ర గోదావరి నదిలో సాయంత్రం నాలుగు గంటలకుసీతారాములకు హంసవాహనంపై తెప్పోత్సవం వేడుక నిర్వహిస్తారు. డిసెంబర్ 23వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు శ్రీ వైకుంఠ ఏకాదశి రోజు సీతారాములు ఉత్తరద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు. ఇవాళ్టి నుంచి నిర్వహించే వేడుకల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం స్వామివారి అవతార దర్శనం అనంతరం మధ్యాహ్నం మహానివేదన ఉంటుంది. ఇక ఆ తర్వాత మంగళ వాద్యాలు, కోలాట నృత్యాలు, వేదమంత్రాల నడుమ స్వామివారిని తిరువీధుల్లో ఊరేగిస్తారు. ఊరేగింపు అనంతరం కల్యాణమండపం వద్ద గల మిథిలా స్టేడియంలో భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు.

Devotees Crowd in Bhadrachalam : జన సందోహంగా భద్రాద్రి.. రామనామ స్మరణతో మార్మోగిన పురవీధులు

ఉత్సవాలు తిలకించటానికి విశేష సంఖ్యలో కదిలి వచ్చే భక్తజనం కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోసం భద్రాచలం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరద్వార దర్శనంలో పాల్గొనే భక్తుల కోసం గతనెల నుంచి టికెట్లను ఆన్​లైన్​లో ఉంచిన అధికారులు ఆలయ ప్రాంతాల్లోని కార్యాలయాల వద్ద కూడా నేరుగా టికెట్లు విక్రయిస్తున్నారు. తెప్పోత్సవం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భద్రాచలం వచ్చే భక్తుల కోసం 2 లక్షల లడ్డు ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నారు.

ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మిథిలా స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మొత్తం రూ.కోటి 20 లక్షలతో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను జరిపిస్తున్నారు. పంచాయతీ రాజ్, గ్రామపంచాయతీ, విద్యుత్, వైద్య, ఆరోగ్య, వివిధ శాఖల సమన్వయంతో ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈఓ రమాదేవి తెలిపారు. ఈ ఉత్సవాలకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో కదిలి వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

రాములోరి తలంబ్రాలు హోమ్‌ డెలివరీ.. కావాలనుకుంటే పోస్టాఫీస్‌కు వెళ్లండి..

భద్రాద్రి రామయ్య కల్యాణానికి కోటి గోటి తలంబ్రాల బహూకరణ

ABOUT THE AUTHOR

...view details