తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్కి అలంకారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య - telangana news

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం భద్రాద్రి రామయ్య కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

కల్కి అలంకారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య
కల్కి అలంకారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య

By

Published : Jan 2, 2021, 1:30 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో శుక్రవారం భద్రాద్రి రామయ్య కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అవతారంలో ఉన్న స్వామి వారిని చిత్రకూట మండపం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారు అశ్వవాహనంపై వేటకు వెళ్తున్న రాజులాగా కత్తి, ధనుర్బాణాలు ధరించి గుర్రంపై కూర్చుని దర్శనమిచ్చారు.

అనంతరం ఆలయ స్థానాచార్యులు స్థల సాయి ఆలయ ప్రధాన అర్చకులు సీతా రామానుజాచార్యులు ఆలయ ఈవో శివాజీ ఆధ్వర్యంలో దొంగల దోపోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారి అభరణాలను ఎత్తుకెళ్లిన దొంగను పోలీసు పట్టుకొని ఆభరణాలను తిరిగి తీసుకుని స్వామి వారికి ధరింపజేసే ఈ ఉత్సవం భక్తులను ఆకట్టుకుంది.

ఇదీ చదవండి:ఇళ్లకే పరిమితం... న్యూ ఇయర్ వేడుకలు మితం!

ABOUT THE AUTHOR

...view details