భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో కుమురం భీం, అంబేడ్కర్ విగ్రహాలకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పూలమాలలు వేశారు. గిరిజనుల హక్కులకు భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. పోడు భూముల హక్కుల కోసం డిసెంబర్ 9న పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని ఆయన హెచ్చరించారు.
పోడు భూముల కోసం ఆందోళన చేస్తాం : ఎంపీ సోయం బాపురావు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు
పోడు భూముల హక్కుల కోసం డిసెంబర్ 9న పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో కుమురం భీం, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. కరోనా వల్ల ఆందోళనలు నిర్వహించడం లేదని ఆయన తెలిపారు.

పోడు భూముల కోసం ఆందోళన చేస్తాం : ఎంపీ సోయం బాపురావు
ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కొత్తగూడెంలోని అన్ని సంఘాలతో కలిసి సమావేశం నిర్వహిస్తామని ఎంపీ తెలిపారు. సీఎం నిర్లక్ష్యం వల్లే మూడో నంబర్ జీవోను సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు. 1976లో లంబాడీ సోదరులను కలిపే విధానంలో అన్యాయం జరుగుతోందని వెల్లడించారు. అంతకుముందు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఆదివాసీ తుడుందెబ్బ కార్యాలయాన్ని సోయం బాపురావు ప్రారంభించారు.