తెలంగాణ

telangana

ETV Bharat / state

శుభకార్యాలు వాయిదా వేసుకోవడమే మేలు: ఎంపీ కవిత - వివాహాది శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని సూచించిన ఎంపీ కవిత

ప్రస్తుతం కొవిడ్​ నిబంధనలు పాటిస్తే భవిష్యత్తులో ఎన్నో శుభకార్యాలు చేసుకోవచ్చని ఎంపీ కవిత అన్నారు. ప్రస్తుతానికి శుభకార్యాలు వాయిదా వేసుకోవడమే మంచిదని చెప్పారు. వివాహాలు, జాతరలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచించారు.

Telangana news
భద్రాద్రి కొత్తగూడెం వార్తలు

By

Published : Jun 6, 2021, 10:01 AM IST

గ్రామాల్లో రోజురోజుగా కొవిడ్​ మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోందని ఎంపీ మాలోతు కవిత అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శుభకార్యాలు వాయిదా వేసుకోవడమే మంచిదని హితవు పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో ఎంపీ కవిత పర్యటించారు.

ఇటీవలే ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కొమ్ముగూడెంలో భారీగా కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. కొమ్ముగూడెంలో 55, ముత్యాల గూడెంలో 64 కేసులున్నాయని తెలిపారు. వివాహాది శుభకార్యాలకు అనుమతి తీసుకోవాలని చెప్పినా అదెక్కడా కార్యరూపం దాల్చడం లేదన్నారు. అధికశాతం కొవిడ్​ కేసులు వివాహవేడుకలకు పెద్దఎత్తున జనం హాజరవడం వల్లే పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఇల్లెందు నియోజకవర్గం బయ్యారంలోను శుభకార్యాల వల్ల మహమ్మారి విస్తరింస్తోందని వెల్లడించారు. గ్రామాల్లో నిర్వహించబోయే బొడ్రాయి, జాతరలను కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఆదివాసీ గూడెంలలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవాలని.. తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతి తీసుకుని నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి:Vaccine drive: హైదరాబాద్​లో అతిపెద్ద వ్యాక్సినేషన్​ డ్రైవ్​ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details