తెలంగాణ

telangana

ETV Bharat / state

MP KAVITHA: గిరిజనులకు అందుతున్న కరోనా చికిత్సపై ఎంపీ కవిత ఆరా - నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎంపీ మాలోతు కవిత

ప్రభుత్వ ఆస్పత్రుల్లో గిరిజనులకు అందుతున్న కరోనా చికిత్సను ఎంపీ మాలోతు కవిత పరిశీలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

MP MALOTH KAVITHA INSPECTED GOVT HOSPITALS AND ASK DOCTORS ABOUT COVID TREATMENT TO TRIBALS
గిరిజనులకు అందుతున్న కరోనా చికిత్సపై ఎంపీ కవిత ఆరా

By

Published : Jun 6, 2021, 7:18 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత పరిశీలించారు. ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో గిరిజనులకు కొవిడ్ వైద్యం ఎలా అందుతుందనే విషయాలను పరిశీలించారు. కరోనా రోగులను కలిసి వారితో మాట్లాడారు.

అనంతరం చర్ల మండలంలోని కొందరు పేద గిరిజనులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. కొవిడ్ బారిన పడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఎంపీతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, తెరాస రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదీ చదవండి:'ఈ నెల 10లోపు ధరణిలో చేరిన రైతులకు నగదు జమ'

ABOUT THE AUTHOR

...view details