భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని మామిడిగుండాల, లచ్చగూడెం గ్రామాల్లోని కరోనా బాధితులను మహబూబాబాద్ ఎంపీ కవిత, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి కనుక్కొని ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. బాధిత కుటుంబాలకు కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు.
ఇల్లందు, గార్ల ఐసోలేషన్ కేంద్రాల్లో ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటుతో చాలామంది ఆరోగ్యంగా ఇంటికి వెళ్లారని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఐసోలేషన్ కేంద్రాలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి భోజనాలను తయారు చేసి పంపిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.