భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు పోలీసులు జరిమానా విధించారు. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో నిబంధనల ప్రకారం మాస్కులు ధరించకుండా వెళ్తున్న వారికి సీఐ వేణుచందర్ అవగాహన కల్పించారు.
నిబంధనలు పాటించని వారిపై పోలీసుల కొరడా - coronavirus india
భద్రాద్రి జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధించారు.
నిబంధనలు పాటించని వారిపై పోలీసుల కొరడా
నిబంధనలు పాటించని వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కొందరు వాహనదారులు గతంలో ఉన్న బకాయిలు సైతం చెల్లించి తమ వాహనాలను తీసుకెళ్లారని తెలిపారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్రూల్స్ పాటించాలని కోరారు.
ఇవీ చూడండి:ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?