Modi talk with Bhadradri young man: మోదీ ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి కార్యక్రమమైన రోజ్‌గార్ మేళా- 2023లో ప్రధానితో మాట్లాడే అవకాశం తెలంగాణ నుంచి సుజాతనగర్ మండలం నిమ్మలగూడెం గ్రామానికి చెందిన కన్నమల్ల వంశీకృష్ణకు దక్కింది. బీటెక్ పట్టభద్రుడైన ఆయన ప్రస్తుతం మహారాష్ట్రలోని బల్లార్‌పూర్ కాలరీస్, ‘34 పిట్స్ మైన్’ జీఎం కార్యాలయంలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా పనిచేస్తున్నారు. ప్రధాని మాట్లాడుతూ ‘మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు ఎలా భావిస్తున్నారు?’ అని ప్రశ్నించారు.
Rozgar Mela 2023 : భద్రాద్రి యువకుడితో ప్రధాని మోదీ సంభాషణ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు
Modi conversation with Bhadradri young man: ‘రోజ్‌గార్ మేళా-2023’ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువ ఉద్యోగికి ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడే అరుదైన అవకాశం దక్కింది. మేళాలో భాగంగా శుక్రవారం ప్రధాని దిల్లీ నుంచి దేశవ్యాప్తంగా యువ ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖాముఖి నిర్వహించారు.
![Rozgar Mela 2023 : భద్రాద్రి యువకుడితో ప్రధాని మోదీ సంభాషణ ప్రధాని మోదీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17540949-383-17540949-1674271117802.jpg)
ప్రధాని మోదీ
వంశీకృష్ణ సమాధానమిస్తూ అమ్మానాన్నలు కూలి పనులకు వెళ్లి తనను చదివించారన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సీటు కష్టపడి సంపాదించానన్నారు. 2021లో పట్టా పొందానని, గత ఏడాది జూన్‌లో ప్రముఖ బొగ్గు కంపెనీలో ఉద్యోగం దక్కిందన్నారు. ‘కర్మయోగి ప్లాట్ ఫాం’ను సద్వినియోగం చేసుకుని మీతో (ప్రధాని) మాట్లాడే అదృష్టం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు.
ఇవీ చదవండి: