వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి భారీ మెజార్టీ సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక నియోజకవర్గం తెరాస నాయకులతో శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులకు వివరించారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీ, విద్య, విద్యుత్ తదితర శాఖల విభాగాల్లో లక్షా 50 వేల ఉద్యోగాలు ప్రభుత్వం కలిగిస్తే ప్రతిపక్షాలు అర్థం లేని విమర్శలు చేస్తున్నాయన్నారు.
గత ఆరేళ్ల కాలంలో ఐటీ విభాగంలో రెండు లక్షల మంది, వివిధ విభాగాల్లో ఐదు లక్షల మంది ఉద్యోగాలు పొందారని ఆయన అన్నారు. ఒప్పంద ఉద్యోగుల్ని జీవో 16 ద్వారా క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం పూనుకుంటే అందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కోర్టులో కేసు వేసిందన్నారు. అయినా ఉద్యోగులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం జీతాలు పెంచి భద్రత కల్పించిందన్నారు. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా గెలుపు పూర్తి ఏకపక్షంగా ఉండాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నాయకులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. ప్రత్యర్థి పార్టీలు ప్రజల మధ్య తిరిగే పరిస్థితి లేనందున అవకాశాల్ని నాయకులు అందిపుచ్చుకోవాలన్నారు.
'పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించేలా పనిచేయాలి' - వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి భారీ మెజార్టీ సాధించేలా పనిచేయాలని నాయకులకు , కార్యకర్తలకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సూచించారు. అభ్యర్థి ఎవరైనా గెలుపు ఏకపక్షంగా ఉండాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులకు వివరించారు.
'పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించేలా పనిచేయాలి'