తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యావంతులు విజ్ఞతతో ఆలోచించాలి: తీన్మార్ మల్లన్న - mlc election campaign at aswaraopeta

అశ్వారావుపేటలో తీన్మార్ మల్లన్నపట్టభద్రుల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆశ్రమ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఓట్లను అభ్యర్థించారు.

mlc election campaign by Teenmar Mallanna at aswaraopeta in Bhadradri district
విద్యావంతులు విజ్ఞతతో ఆలోచించాలి: తీన్మార్ మల్లన్న

By

Published : Feb 6, 2021, 7:27 PM IST

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల అభ్యర్థి తీన్మార్ మల్లన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఓట్లను అభ్యర్థించారు.

ఉద్యోగాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉద్యోగులను అనేక సమస్యలకు గురి చేస్తోందని ఆరోపించారు. విద్యావంతులు విజ్ఞతతో ఆలోచించి మొదటి ప్రాధాన్యత తనకే ఇవ్వాలని.. మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఇదీ చూడండి:మల్కపేటలో స్మితా సబర్వాల్ పర్యటన.. రిజర్వాయర్ పనుల పరిశీలన

ABOUT THE AUTHOR

...view details