భద్రాద్రి కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు, జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లుకు మధ్య వాగ్వాదం (mutual allegations) జరిగింది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కొనసాగుతుండగా... ఇసుక ర్యాంపు అంశం తెరపైకి వచ్చింది. ఇసుక ర్యాంపుల ఏర్పాటుపై అడిగిన ప్రశ్నల పట్లు డీసీఓ సానుకూలంగా స్పందించలేదని... ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆరోపించారు.
భద్రాద్రిలో ఇసుక ర్యాంపులు... ఎమ్మెల్సీ, డీసీఓల పరస్పర ఆరోపణలు - ఎమ్మెల్సీ బాలసాని
ఇసుక ర్యాంపు విషయంలో జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ, జిల్లా సహకార అధికారి పరస్పర ఆరోపణలు (mutual allegations) చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో చోటు చేసుకుంది. ఈ వివాదంపై స్పందించిన కలెక్టర్... విచారణ చేపట్టి రెండు వారాల్లో పూర్తి చేసి... తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ క్రమంలో ఎమ్మెల్సీనే తనను వేధిస్తున్నాడంటూ జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు ఆరోపించారు. నేనెక్కడ వేధిస్తున్నానంటూ... ఎమ్మెల్సీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై జిల్లా అధికారి పచ్చి అబద్ధాలు, ఆరోపణలు చేస్తున్నారని బాలస్వామి ఆరోపించారు. భద్రాచలంలో ఇసుక ర్యాంపు విషయంలో తాను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని వెల్లడించారు. వెంకటేశ్వర్లు అవాస్తవంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని బాలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధానపరమైన సమస్యలంటే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ వివాదంపై స్పందించిన కలెక్టర్... ఈ అంశంపై విచారణ చేస్తామన్నారు. రెండు వారాల్లో విచారణ పూర్తి చేసి... తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చూడండి:Live Video: సమస్యలపై ప్రశ్నించినందుకు స్థానికునిపై సర్పంచ్ దాష్టికం.. వీడియో వైరల్