తెలంగాణ

telangana

ETV Bharat / state

పాఠశాల స్థలాన్ని రక్షించండి: ఎమ్మెల్యే వీరయ్య - ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్

భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చేపడుతోన్న నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పురపాలక సంఘానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

mla podem veeraiah
mla podem veeraiah

By

Published : Jun 15, 2021, 3:36 PM IST

భద్రాద్రి జిల్లా ఇల్లందు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చేపడుతోన్న నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని ఎమ్మెల్యే పొదెం వీరయ్య డిమాండ్ చేశారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన వెండర్స్ కాంప్లెక్స్ నిర్మాణాల వల్ల.. విద్యార్థులకు ప్రశాంతత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పాఠశాల ఆవరణలో వ్యాపార సముదాయాల నిర్మాణం చేపట్టాలనుకోవడం సముచితం కాదన్నారు ఎమ్మెల్యే. కట్టడాలను.. మరో ప్రాంతంలో నిర్మించుకోవాలని సూచించారు. నిర్మాణాన్ని నిలిపివేయకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:Suicide: కుక్కపిల్ల కొనివ్వలేదని బాలుడు ఆత్మహత్య!

ABOUT THE AUTHOR

...view details